
లార్డ్స్: శ్రీలంకతో రెండో టెస్టులో ఇంగ్లండ్ 190 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సొంతం చేసుకుంది. నాలుగో రోజు ఆదివారం ఇంగ్లండ్ ఇచ్చిన 483 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో లంక 292 రన్స్‌కే కుప్పకూలింది. దినేశ్ చండిమల్ (58), దిముత్ కరుణరత్నే (55), ధనంజయ డిసిల్వా (50), మిలాన్‌రత్నాయకే (43) కాసేపు ప్రతిఘటించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్‌గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మూడో చివరి టెస్టు ఈ నెల 6 నుంచి జరుగుతుంది.