రెండోసారి టీ20 వరల్డ్‌‌కప్‌‌ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌‌‌‌

రెండోసారి టీ20 వరల్డ్‌‌కప్‌‌ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌‌‌‌
  • పాక్‌కు స్ట్రోక్స్‌ 
  • రాణించిన బెన్‌‌‌‌ స్టోక్స్‌‌, సామ్‌‌ కరన్‌‌
  • రూ. 13 కోట్ల ప్రైజ్‌‌మనీ సొంతం

హిస్టరీ ఘనంగా ఉన్నా.. ఫామ్‌‌‌‌దే పైచేయి అయ్యింది..! అనూహ్యంగా ఫైనల్‌‌కు దూసుకొచ్చిన పాకిస్తాన్‌‌.. టైటిల్ ఫైట్‌‌లో తడబడింది..! ఇంగ్లిష్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ బెన్ స్టోక్స్‌‌ (49 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 52 నాటౌట్‌‌) దెబ్బకు పాక్‌‌ వరల్డ్‌‌ క్లాస్‌‌ బౌలర్లందరూ పరేశాన్‌‌లో పడ్డరు..! ఫలితంగా లో స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లో నిలకడగా ఆడినా.. ఇంగ్లండ్‌‌ రెండోసారి టీ20 వరల్డ్‌‌కప్‌‌ను సొంతం చేసుకుంది..!!  

మెల్‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌:  టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో నిలకడగా ఆడిన ఇంగ్లండ్‌‌‌‌.. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ విజేతగా నిలిచింది. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీకి తోడు సామ్‌‌‌‌ కరన్‌‌‌‌ (3/12) బౌలింగ్‌‌‌‌లో చెలరేగడంతో... ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌‌‌‌ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌‌‌పై గెలిచింది. దీంతో 2010 తర్వాత మరోసారి పొట్టి కప్‌‌‌‌ను కైవసం చేసుకుని వెస్టిండీస్‌‌‌‌ సరసన చోటు సంపాదించింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాక్‌‌‌‌ 20 ఓవర్లలో 137/8 స్కోరు చేసింది. షాన్‌‌‌‌ మసూద్‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 38) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌‌‌ 19 ఓవర్లలో 138/5 స్కోరు చేసి నెగ్గింది. స్టోక్స్‌‌‌‌తో పాటు కెప్టెన్‌‌‌‌ జోస్‌‌‌‌ బట్లర్‌‌‌‌ (26) ఫర్వాలేదనిపించాడు. సామ్‌‌‌‌ కరన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌, సిరీస్​’ అవార్డులు లభించాయి. 

కరన్‌‌‌‌ జోరు..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాక్‌‌‌‌ను కరన్‌‌‌‌, ఆదిల్‌‌‌‌ రషీద్‌‌‌‌ (2/22) బాగా కట్టడి చేశారు. మిడిల్‌‌‌‌ ఓవర్స్‌‌‌‌లో ఈ ఇద్దరు 25 డాట్స్‌‌‌‌ బాల్స్‌‌‌‌ వేయడంతో పాక్‌‌‌‌ భారీ టార్గెట్‌‌‌‌ను నిర్దేశించలేకపోయింది. బౌన్సీ పిచ్‌‌‌‌పై స్టార్టింగ్‌‌‌‌లో స్టోక్స్‌‌‌‌ (1/32) కాస్త ప్రభావం చూపినా.. క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ వికెట్లు తీయలేకపోయాడు. దీంతో ఓపెనర్లు బాబర్‌‌‌‌ (32), రిజ్వాన్‌‌‌‌ (15) ఆరంభంలో మెరుగ్గానే ఆడారు. అయితే ఐదో ఓవర్‌‌‌‌లో కరన్‌‌‌‌ దెబ్బకు.. రిజ్వాన్‌‌‌‌ ఔట్‌‌‌‌ కావడంతో తొలి వికెట్‌‌‌‌కు 29 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. పవర్‌‌‌‌ప్లేలో 39/1 స్కోరు వచ్చినా.. 8వ ఓవర్‌‌‌‌లో హారిస్‌‌‌‌ రవూఫ్‌‌‌‌ (8) ఔట్‌‌‌‌కావడంతో పాక్‌‌‌‌ వికెట్లపతనం మొదలైంది. ఈ దశలో బాబర్‌‌‌‌, షాన్‌‌‌‌ మసూద్‌‌‌‌ నిలకడగా ఆడటంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో పాక్‌‌‌‌ 68/2 స్కోరు చేసింది. ఈ జోడీని విడగొట్టేందుకు బట్లర్‌‌‌‌ 11వ ఓవర్‌‌‌‌లో స్లో ఆఫ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ బౌలర్‌‌‌‌ లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ను దించాడు. కానీ మసూద్‌‌‌‌ 4, 6తో 16 రన్స్‌‌‌‌ రాబట్టాడు. అయితే 12వ ఓవర్‌‌‌‌లో రషీద్‌‌‌‌ ఓ సూపర్‌‌‌‌ గూగ్లీతో బాబర్‌‌‌‌ను కాటన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేయడంతో మూడో వికెట్‌‌‌‌కు 39 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఆరు బాల్స్‌‌‌‌ తర్వాత ఇఫ్తికార్ (0) కూడా ఔట్‌‌‌‌కావడంతో పాక్‌‌‌‌ 13 ఓవర్లలో 90/4తో కష్టాల్లో పడింది. మసూద్‌‌‌‌తో కలిసి షాదాబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (20) వీలైనంత వేగంగా ఆడాడు. 17వ ఓవర్‌‌‌‌లో కరన్‌‌‌‌.. మసూద్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి స్కోరును కట్టడి చేశాడు. ఇక్కడి నుంచి పాక్‌‌‌‌ ఓవర్‌‌‌‌కు ఓ వికెట్‌‌‌‌ను కోల్పోయింది. 18వ ఓవర్‌‌‌‌లో షాదాబ్‌‌‌‌, తర్వాతి ఓవర్‌‌‌‌లో మహ్మద్‌‌‌‌ నవాజ్‌‌‌‌ (5), ఆఖరి ఓవర్‌‌‌‌లో మహ్మద్‌‌‌‌ వసీమ్‌‌‌‌ (4) పెవిలియన్‌‌‌‌కు చేరడంతో పాక్‌‌‌‌ మోస్తరు టార్గెట్‌‌‌‌నే నిర్దేశించింది. జోర్డాన్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. 

ప్రైజ్‌‌‌‌మనీ

విజేత ఇంగ్లండ్‌‌‌‌కు రూ. 13 కోట్లు, రన్నరప్‌‌‌‌ పాకిస్తాన్‌‌‌‌కు రూ. 6.5 కోట్లు, సెమీస్‌‌‌‌లో ఓడిన ఇండియా, న్యూజిలాండ్‌‌‌‌కు చెరో రూ. 3.25 కోట్ల చొప్పున లభించింది. 

ఆఫ్రిదికి గాయం

చిన్న టార్గెట్‌‌‌‌ను ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌‌‌‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఇండియాపై వీరోచితంగా ఆడిన హేల్స్‌‌‌‌ (1) ఈ మ్యాచ్‌‌‌‌లో ఫెయిలయ్యాడు. ఇన్నింగ్స్‌‌‌‌ ఆరో బాల్‌‌‌‌కే ఔట్‌‌‌‌కావడంతో ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌ 7 రన్స్‌‌‌‌ వద్ద తొలి వికెట్‌‌‌‌ కోల్పోయింది. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌ (10) రెండో వికెట్‌‌‌‌కు 25 రన్స్‌‌‌‌ జోడించి నాలుగో ఓవర్‌‌‌‌లో వెనుదిరిగాడు. ఆరో ఓవర్‌‌‌‌లో బట్లర్‌‌‌‌ కూడా ఔట్‌‌‌‌కావడంతో ఇంగ్లండ్‌‌‌‌ 45/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఇందులో రవూఫ్‌‌‌‌ రెండు, ఆఫ్రిది ఒక్క వికెట్‌‌‌‌ తీశాడు. ఈ దశలో వచ్చిన స్టోక్స్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ చివరి వరకు నిలబడి.. 2019 వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ విజయాన్ని గుర్తుకు తెచ్చాడు. హారి బ్రూక్‌‌‌‌ (20) కూడా సమయోచితంగా స్పందించాడు. ఈ ఇద్దరు వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదడంతో పవర్‌‌‌‌ప్లేలో 49/3 స్కోరు చేసిన ఇంగ్లండ్‌‌‌‌ 12 ఓవర్లలో 82/3కి చేరింది. అయితే 13వ ఓవర్‌‌‌‌లో బ్రూక్‌‌‌‌ ఔట్‌‌‌‌కావడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 39 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఇక్కడి నుంచి మొయిన్‌‌‌‌ అలీ (19), స్టోక్స్‌‌‌‌ నెమ్మదిగా ఆడటతో 15 ఓవర్లలో 97/4 స్కోరు చేసింది. ఇక గెలవాలంటే 30 బాల్స్‌‌‌‌లో 41 రన్స్‌‌‌‌ చేయాల్సిన దశలో 16వ ఓవర్‌‌‌‌లో స్టోక్స్‌‌‌‌ వరుసగా 4, 6 బాదడంతో విజయసమీకరణం 24 బాల్స్‌‌‌‌లో 28గా మారింది. ఈ దశలో ఇంకా 2  ఓవర్లు మిగిలి ఉన్న షాహిన్​ ఆఫ్రిది గాయపడటం పాక్‌‌‌‌ను దెబ్బతీసింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో అలీ మూడు ఫోర్లు కొట్టాడు. చివరకు 19వ ఓవర్‌‌‌‌లో అలీ ఔటైనా, స్టోక్స్‌‌‌‌ ఫోర్‌‌‌‌తో వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ అందించాడు. అలీ, స్టోక్స్‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌కు 48 రన్స్‌‌‌‌ జోడించారు. షాదాబ్‌‌‌‌, వసీమ్‌‌‌‌ చెరో వికెట్‌‌‌‌ తీశారు. 

స్లో బాల్స్‌‌తో కట్టడి

ఎంసీజీలో  పెద్ద బౌండ్రీలు ఉండటంతో.. పాక్‌‌ను బౌలింగ్‌‌తో కట్టడి చేయాలని ప్లాన్‌‌ చేశాం. వికెట్‌‌ టు వికెట్‌‌ వేస్తే కచ్చితంగా షాట్లకు ట్రై చేస్తారని తెలుసు. నా బౌలింగ్‌‌కు ఈ పిచ్‌‌ సరిగ్గా సరిపోతుంది. అందుకే నేను స్క్వేర్‌‌ ఆఫ్‌‌ ద వికెట్‌‌గా వేయడానికి ప్రయత్నించా. ఈ పిచ్‌‌ మీద బౌలింగ్‌‌ చేయడం సీమర్లకు సవాలే. నేను మునుపటి కంటే చాలా స్లోగా బౌలింగ్‌‌ చేశా. స్లో బాల్స్‌‌ బ్యాటర్‌‌ దగ్గరికి వెళ్లి షాట్లు కొట్టేలా ప్రేరేపించా. ఛేజింగ్‌‌ మాకు కఠిన సవాల్‌‌గా మారింది. కానీ స్టోక్స్‌‌ వల్లే మ్యాచ్‌‌ గెలిచాం. అతనో చాంపియన్‌‌. అతను టీమ్‌‌లో ఉండటం ఎప్పుడు బలమే. ప్రతి ఫైనల్లో అతను హాఫ్‌‌ సెంచరీ చేయడం అలవాటుగా మారింది. ఇది మాకు కలిసొచ్చింది. టీమ్‌‌కు అవసరమైనప్పుడు కచ్చితంగా ఆడతాడు. ఇదో గొప్ప టోర్నమెంట్‌‌. వరల్డ్‌‌కప్‌‌ను నేను తొలిసారి ఆస్వాదిస్తున్నా. మా టీమ్‌‌ అద్భుతంగా ఉంది. సమష్టి కృష్టి వల్లే ఇంత పెద్ద ఫలితం వచ్చింది. డెత్‌‌ ఓవర్లలో నా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్​నూ మెరుగుపర్చుకోవాలనుకుటున్నా. ప్రపంచ చాంపియన్‌‌ కావడం చాలా ఆనందాన్నిస్తున్నది.         - 

సామ్‌‌ కరన్‌‌

ఛేజింగ్‌‌లో కష్టపడ్డాం

పాక్‌‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేసినా ఛేజింగ్‌‌ మాకు అంత ఈజీగా సాగలేదు. మేం ఎలా బౌలింగ్‌‌ చేశామో పాక్‌‌ కూడా అలాగే చేసింది. అయితే రషీద్‌‌, కరన్‌‌ మమ్ముల్ని పై స్థాయిలో నిలబెట్టారు. ఇది గమ్మతైన వికెట్‌‌. దీనిపై 130 రన్స్‌‌ కూడా ఛేజ్‌‌ చేయడం కష్టమే. అందుకే ఈ విజయం మా బౌలర్లదే. ఐర్లాండ్‌‌ చేతిలో ఓటమితో నిరాశ చెందాం. కానీ దాన్ని అక్కడే వదిలేయాలని డిసైడ్‌‌ అయ్యాం. టోర్నీలో ముందుకెళ్లాలంటే అలాంటి వాటిని పట్టించుకోవద్దు. అప్పుడే బాగా ఆడగలుగుతాం. అత్యుత్తమ జట్లు ఎప్పుడూ తమ తప్పుల నుంచి నేర్చుకుంటాయి. మేం కూడా ఎంసీజీలో అప్పుడు చేసిన తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాం. దాని ఫలితమే వరల్డ్‌‌కప్‌‌. ఇలాంటి టోర్నీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా అద్భుతంగా ఉంటుంది. కప్‌‌లు గెలిస్తే గర్వంగానూ ఉంటుంది. 

‑ బెన్‌‌ స్టోక్స్‌‌. 

ఆఫ్రిది గాయపడకపోతే..

ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు, ప్రతి ఒక్కరూ మాకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడకు వచ్చినట్లు మేము భావించాం. చాలా ధన్యవాదాలు. గత నాలుగు మ్యాచ్‌‌ల్లో జట్టు ఆడిన తీరు అద్భుతం. తమ సహజ సిద్ధమైన ఆటను స్వేచ్ఛగా ఆడమని మా ప్లేయర్లతో చెప్పా. మేం మరో 20 రన్స్‌‌ చేయాల్సి ఉండేది. అయినా చివరి వరకు మా పోరాటాన్ని కొనసాగించాం. మా బౌలింగ్ అత్యుత్తమంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆఫ్రిదికి గాయం మాకు భిన్నమైన ఫలితాన్నిచ్చింది. అయినా ఇదంతా ఆటలో భాగమే. 
‑ బాబర్‌‌ ఆజమ్‌‌ (పాకిస్తాన్​ కెప్టెన్​)

1   వన్డే, టీ20 వరల్డ్‌‌‌‌కప్స్‌‌ను వరుసగా గెలిచిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌‌ రికార్డు సృష్టించింది.
11  టీ20 వరల్డ్‌‌కప్స్‌‌లో ఇప్పటి వరకు 11 నాకౌట్‌‌ మ్యాచ్‌‌లు జరిగితే అన్నింటిలోనూ ఛేజింగ్‌‌ జట్లే గెలిచాయి. 
1  రెండు వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌కప్స్‌‌‌‌లో అత్యధిక స్కోరు చేసి తొలి బ్యాటర్‌‌‌‌గా విరాట్‌‌‌‌ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో 296 రన్స్‌‌‌‌ చేయగా, 2014 మెగా ఈవెంట్‌‌‌‌లో 319 రన్స్‌‌‌‌ సాధించాడు.

స్కోరు బోర్డు

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌: రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ (బి) కరన్‌‌‌‌‌‌‌‌ 15, బాబర్‌‌‌‌‌‌‌‌ (సి అండ్‌‌‌‌‌‌‌‌ బి) రషీద్‌‌‌‌‌‌‌‌ 32, హారిస్‌‌‌‌‌‌‌‌ (సి) స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (బి) రషీద్‌‌‌‌‌‌‌‌ 8, షాన్‌‌‌‌‌‌‌‌ మసూద్‌‌‌‌‌‌‌‌ (సి) లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ (బి) కరన్‌‌‌‌‌‌‌‌ 38, ఇఫ్తికార్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ (సి) బట్లర్‌‌‌‌‌‌‌‌ (బి) స్టోక్స్‌‌‌‌‌‌‌‌ 0, షాదాబ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (సి) వోక్స్‌‌‌‌‌‌‌‌ (బి) జోర్డాన్‌‌‌‌‌‌‌‌ 20, మహ్మద్‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌‌‌‌‌ (సి) లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ (బి) కరన్‌‌‌‌‌‌‌‌ 5, మహ్మద్‌‌‌‌‌‌‌‌ వసీమ్‌‌‌‌‌‌‌‌ (సి) లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ (బి) జోర్డాన్‌‌‌‌‌‌‌‌ 4, షాహిన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్రిది (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 5, హారిస్‌‌‌‌‌‌‌‌ రవూఫ్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 1, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 137/8. వికెట్లపతనం: 1–29, 2–45, 3–84, 4–85, 5–121, 6–123, 7–129, 8–131. బౌలింగ్‌‌‌‌‌‌‌‌: బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ 4–0–32–1, క్రిస్‌‌‌‌‌‌‌‌ వోక్స్‌‌‌‌‌‌‌‌ 3–0–26–0, సామ్‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌ 4–0–12–3, ఆదిల్‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌ 4–1–22–2, క్రిస్‌‌‌‌‌‌‌‌ జోర్డాన్‌‌‌‌‌‌‌‌ 4–0–27–2, లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ 1–0–16–0. 

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌: జోస్‌‌‌‌‌‌‌‌ బట్లర్‌‌‌‌‌‌‌‌ (సి) రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ (బి) రవూఫ్‌‌‌‌‌‌‌‌ 26, అలెక్స్‌‌‌‌‌‌‌‌ హేల్స్‌‌‌‌‌‌‌‌ (సి) షాహిన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్రిది 1, ఫిల్‌‌‌‌‌‌‌‌ సాల్ట్‌‌‌‌‌‌‌‌ (సి) ఇఫ్తికార్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ (బి) రవూఫ్‌‌‌‌‌‌‌‌ 10, బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 52, హారి బ్రూక్‌‌‌‌‌‌‌‌ (సి) షాహిన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్రిది (బి) షాదాబ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ 20, మొయిన్‌‌‌‌‌‌‌‌ అలీ (బి) మహ్మద్‌‌‌‌‌‌‌‌ వసీమ్‌‌‌‌‌‌‌‌ 19,లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 1, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు: 9, మొత్తం: 19 ఓవర్లలో 138/5. వికెట్లపతనం: 1–7, 2–32, 3–45, 4–84, 5–132. బౌలింగ్: షాహిన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్రిది 2.1–0–13–1, నసీమ్‌‌‌‌‌‌‌‌ షా 4–0–30–0, హారిస్‌‌‌‌‌‌‌‌ రవూఫ్‌‌‌‌‌‌‌‌ 4–0–23–2, షాదాబ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ 4–0–20–1, మహ్మద్‌‌‌‌‌‌‌‌ వసీమ్‌‌‌‌‌‌‌‌ 4–0–38–1, ఇఫ్తికార్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ 0.5–0–13–0.