భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. నాగ్ పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లేకుండానే భారత్ మ్యాచ్ ఆడుతుంది. మోకాలి నొప్పితో కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడని టాస్ అనంతరం రోహిత్ శర్మ చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కు ఈ మ్యాచ్ లో చోటు దక్కలేదు.
ప్లేయింగ్ 11లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు నిరాశ తప్పలేదు. ఫామ్ లో ఉన్న స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ బెంచ్ కే పరిమితమయ్యాడు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, హర్షిత్ రానా వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. తొలి మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):
బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్
Also Read :- క్రికెట్ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్