ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు బట్లర్‌‌‌‌‌‌‌‌ దూరం

లండన్‌‌‌‌‌‌‌‌ : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు ముందు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు ఎదురుదెబ్బ తగిలింది. కుడి కాలి పిక్క గాయంతో  కెప్టెన్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌ బట్లర్‌‌‌‌‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యాడు. అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో జెమీ ఒర్టన్‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. ఫిల్‌‌‌‌‌‌‌‌ సాల్ట్‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్సీ అప్పగించారు. బుధవారం నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌ జరుగుతుంది. 

బట్లర్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా కోలుకోవడానికి రెండు వారాల టైమ్‌‌‌‌‌‌‌‌ పడుతుందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ నెల 19న మొదలయ్యే మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ వరకూ బట్లర్‌‌‌‌‌‌‌‌ కోలుకోకపోతే అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో జోర్డాన్‌‌‌‌‌‌‌‌ కాక్స్‌‌‌‌‌‌‌‌ను తీసుకుంటామని ఇంగ్లండ్​ బోర్డు వెల్లడించింది.