టీమిండియాతో జరగబోయే తొలి టీ20కి ఒక రోజు ముందే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. తుది జట్టులో ఏకంగా నలుగురు ఫాస్ట్ బౌలర్లకు ఛాన్స్ దక్కింది. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్ లకు చోటు దక్కింది. ఏకైక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ ను ఎంపిక చేశారు. కెప్టెన్ గా బట్లర్ ఇంగ్లాండ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. హ్యారీ బ్రూక్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
Also Read :- టీమిండియాతో వైట్ బాల్ సిరీస్.. ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్‌గా యువ క్రికెటర్
బట్లర్ సారధ్యంలోని ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. సిరీస్ గెలిచి భారత్ కు షాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈడెన్ గార్డెన్ లాంటి స్పిన్ ట్రాక్ పై నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వికెట్ కీపర్ బాధ్యతలు సాల్ట్ తీసుకోనున్నాడు. రైజింగ్ స్టార్ జాకబ్ బెతేల్.. పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ కు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నారు. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 బుధవారం (జనవరి 22) ప్రారంభం కానుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది.
భారత్ తో తొలి టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), బెన్ డకెట్, జామీ ఓవర్టన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్
ENGLAND'S PLAYING XI FOR THE 1ST T20I VS INDIA:
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2025
Salt (WK), Duckett, Buttler (C), Brook, Livingstone, Bethell, Overton, Atkinson, Archer, Rashid and Wood. pic.twitter.com/3qy5KA9qzS