
హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ- 2023–-2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
విభాగాలు : ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్స్, హిందీ, అరబిక్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, జర్మన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, రష్యన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, స్పానిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్.
అర్హత : సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్స్ కల్పిస్తారు.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.efluniversity.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.