స్టూడెంట్స్​కు బ్లూ ఫిల్మ్​ చూపించిన ఇంగ్లిష్​ టీచర్

  • ఆదిలాబాద్ అర్బన్​ జిల్లాలో ఘటన

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: స్టూడెంట్స్​కు టీచర్​క్లాస్​లో బ్లూ ఫిల్మ్ ​చూపించిన ఘటన ఆదిలాబాద్​ జిల్లాలో కలకలం రేపింది. ఇదేం పాడు పని అని పేరెంట్స్ ​ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్​తర్వాత ఇప్పుడిప్పుడే తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నామని ఇలాంటి ఘటనలు భయపెడుతున్నాయని మండి పడుతున్నారు. జిల్లాలోని తాంసి మండలం ఘోట్కూరి జడ్పీహెచ్ఎస్ లో పనిచేస్తున్న ఇంగ్లిష్ ​టీచర్ ​ఖదీర్. సోమవారం ఉదయం ఆరో క్లాస్​కు వెళ్లిన ఆయన లెస్సన్స్ చెప్పకుండా స్టూడెంట్స్​కు తన ఫోన్​లో బ్లూ ఫిల్మ్​ చూపించాడు. ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్, గ్రామస్తులు​ ఆగ్రహంతో స్కూల్​కు చేరుకున్నారు. సదరు టీచర్​ను ఓ రూమ్​లో పెట్టి లాక్​ చేశారు. అనంతరం స్కూల్​ ముందు ఆందోళన చేశారు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచరే ఇలాంటి పనులు చేస్తే పిల్లలను ఎలా పంపించాలని హెచ్ఎంను నిలదీశారు. సమాచారం అందుకున్న ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తంచారీ, ఎస్సై శిరీష, విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్లు కంటె నర్సయ్య, ఉదయశ్రీ, కంది శ్రీనివాస్​ రెడ్డి స్కూల్​కు వచ్చారు. స్టూడెంట్స్, పేరెంట్స్, ఇంగ్లిష్​ టీచర్​తో మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. హెచ్ఎం రిపోర్టు ఆధారంగా టీచర్ ఖదీర్​ను డ్యూటీ నుంచి సస్పెండ్ ​చేస్తూ డీఈఓ ఎ.రవీందర్​రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇటీవల ఇదే మండలంలో వర్క్​ చేసిన ఎంఈఓ, కొందరు టీచర్లు స్కూల్లో మందు తాగుతూ, పేకాట ఆడి సస్పెండ్​ అయ్యారు.