తల్లాడ, వెలుగు : ఖమ్మం జిల్లా ఏన్కూర్ తహసీల్దార్ఎస్కే ఖాసీం ఏసీబీకి చిక్కారు. మండలంలోని నాచారం గ్రామానికి చెందిన బానోతు బుజ్జా అనే మహిళ తన పొలంలోని 24 గుంటలను తన కొడుకైన రామకృష్ణ పేరు మీదకు మార్చాలనుకుంది. దీనికి గాను పట్టా పాస్ బుక్ ఇచ్చేందుకు తహసీల్దార్ రూ.3 వేల లంచం డిమాండ్ చేశాడు.
దీంతో రామకృష్ణ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రూ.3వేలను గురువారం తహసీల్దార్ఆఫీసులో ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే ఖమ్మం సిటీలోని చెరువు బజార్లో ఉన్న తహసీల్దార్ఇంట్లోనూ ఏసీబీ డీఎస్పీ ఎస్.సూర్యనారాయణ, సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలోని ఏసీబీ అధికారుల తనిఖీలు చేశారు.