టెన్త్ పేపర్ లీక్ పై ఎంక్వైరీ షురూ

టెన్త్ పేపర్ లీక్ పై ఎంక్వైరీ షురూ
  • సీఎస్, డీవోలను విధుల నుంచి తప్పించిన ఆఫీసర్లు
  • ఇన్విజిలేటర్  సస్పెన్షన్, స్టూడెంట్  డిబార్

నల్గొండ/నకిరేకల్, వెలుగు: నల్గొండ జిల్లా నకిరేకల్​ ఎస్సీ గురుకుల పాఠశాలలో తెలుగు పేపర్  లీకైన వ్యవహారంపై ఎంక్వైరీ షురూ అయింది. ఎగ్జామ్​ పేపర్​ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, నకిరేకల్  ఎంఈవో నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బార్  కోడ్  ఆధారంగా నకిరేకల్​లోని ఎస్సీ గురుకుల పాఠశాల నుంచి లీకైనట్లు గుర్తించారు. గోడ దూకి వచ్చిన వ్యక్తి పరీక్ష హాల్ కు వెళ్లి ప్రశ్నాపత్రాన్ని సెల్​ఫోన్​లో ఫొటో తీసినట్లు విచారణలో తేల్చారు. 

ఎగ్జామ్​ సెంటర్​ సీఎస్​ గోపాల్, డిపార్ట్​మెంటల్  ఆఫీసర్  రామ్మోహన్ రెడ్డిని పరీక్ష విధుల నుంచి తప్పించగా, ఇన్విజిలేటర్  సుధారాణిని సస్పెండ్  చేశారు. స్టూడెంట్​ను డిబార్  చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు, విద్యా శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నాపత్రం ఫొటోలను సోషల్  మీడియాలో వైరల్  చేసిన 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో ఓ ప్రైవేట్​ స్కూల్​ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు 
వినిపిస్తున్నాయి.