జగిత్యాల టౌన్, వెలుగు : ఇజ్రాయిల్‌లో విదేశీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మంగళవారం ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కాం) మేనేజర్ అనిల్ కుమార్, జిల్లా ఉపాధి కల్పన అధికారిణి సత్తెమ్మ తెలిపారు.
ఇజ్రాయిల్‌లో పనిచేసేందుకు అన్ స్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికుల కోసం ఈ డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పారు. సుమారు 800 మంది ఎన్‌రోల్ అయినట్లు అధికారులు తెలిపారు.