ఫ్లాగ్ కోడ్ సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలి

యాదాద్రి, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ప్రదర్శించేందుకు  ఏర్పాట్లు చేశామని యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతి తెలిపారు. ఇప్పటికే 1.60 లక్షల జెండాలు వచ్చాయని, మరో లక్ష జెండాలు వస్తున్నాయని చెప్పారు. కలెక్టరేట్​లో మంగళవారం ఉత్సవాల నిర్వహణపై రివ్యూ చేశారు. ​జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు 40 వేల జెండాలు, 421 పంచాయతీలకు మిగిలిన జెండాలు పంపిణీ చేశామన్నారు. ఫ్లాగ్ కోడ్ సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలని ఆఫీసర్లకు సూచించారు. బుధవారం నిర్వహించే వన మహోత్సవంలో  75 అక్షరం వచ్చే విధంగా మొక్కలు నాటాలన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. స్కూల్స్​లో దేశ భక్తి గీతాలపై పాటల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం రోటరీ క్లబ్​ ఆధ్వర్యంలో  స్కూల్​ పిల్లలకు, పేద మహిళలకు సైకిళ్లు, కుట్టు మెషిన్లు పంపిణీ చేశారు. 

మహాత్మా గాంధీ సినిమా చూసిన కలెక్టర్​

వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం  జిల్లాలోని పలు థియేటర్లలో ‘గాంధీ’  సినిమా ప్రదర్శించారు. ఈ సినిమాను కలెక్టర్​ పమేలా సత్పతి, అడిషనల్​ కలెక్టర్​ దీపక్​ తివారి, డీఈవో కే నారాయణరెడ్డి, టీచర్లతో పాటు 3,586 మంది స్టూడెంట్లు గాంధీ సినిమాను చూశారు. వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం   

సూర్యాపేట, వెలుగు:  స్వాతంత్ర్య  వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని,  ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం స్పీడప్​ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్​లో  కలెక్టర్ మున్సిపల్​చైర్మన్​తో కలిసి ​జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా డీఈవో  ఆధ్వర్యంలోజిల్లాలోని  సినిమా థియేటర్ లో స్టూడెంట్లకు గాంధీ సినిమాను ప్రదర్శించారు.  అడిషనల్ ​కలెక్టర్​ పాటిల్ హేమంత్ కేశవ్, మోహన్ రావు, ఆర్డీవో రాజేంద్ర కుమార్, కమిషనర్ బి.సత్య నారాయణ రెడ్డి పాల్గొన్నారు.