ఎంజీఎంలో బెస్ట్ ట్రీట్‎మెంట్ అందించేలా చేస్తం: మంత్రి కొండా సురేఖ

ఎంజీఎంలో బెస్ట్ ట్రీట్‎మెంట్ అందించేలా చేస్తం: మంత్రి కొండా సురేఖ

కాశీబుగ్గ, వెలుగు: ఉత్తర తెలంగాణకు గుండె కాయ అయిన వరంగల్​ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు బెస్ట్​ట్రీట్​మెంట్​అందించేలా చేస్తమని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. గురువారం వరంగల్​సిటీలోని మహాత్మాగాంధీ ఆస్పత్రి(ఎంజీఎం)ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ ను, ఓపీకి కొత్త కంప్యూటర్, ఫార్మసీ కౌంటర్లను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఎంజీఎం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను దశలవారీగా మరింత అభివృద్ధి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. 

ముఖ్యంగా డయాలసిస్, హృద్రోగ,  పీడియాట్రిక్ విభాగాలను ప్రభుత్వ, సీఎస్ఆర్ నిధుల ద్వారా మరింత బలోపేతం చేసి సేవలు ఈసీ చేస్తామని చెప్పారు. ఆస్పత్రికి వచ్చే రోగుల అటెండెంట్లకు క్యాంటిన్ లో నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించాలని సూచించారు. మహిళ సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

జిల్లావ్యాప్తంగా ఇందిరా మహిళ శక్తి పథక కార్యకలాపాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన చెన్నారావుపేట మండల మహిళ సమాఖ్యకు, పట్టణంలో ఖిల్లా వరంగల్ తెలుగు తల్లి టీఎల్ఎఫ్ లకు మంత్రి ట్రోఫీని బహుకరించి సన్మానించారు. కార్యక్రమాల్లో మేయర్  గుండు సుధారాణి, వరంగల్​కలెక్టర్ సత్య శారద దేవి, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ, డీఎఫ్ఓ, అధికారులు పాల్గొన్నారు.