
మాదాపూర్, వెలుగు: మాదాపూర్ శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బెంగళూరులోని సుముఖశ్రీ కళా కుటీర నుంచి విచ్చేసిన అశ్విని సుకీర్తి బృందం భరతనాట్య ప్రదర్శనతో ప్రేక్షకుల చూపును కట్టిపడేసింది. తం తం తం మూషిక వాహన, రరావేణు, సరసిజాక్షులు, దరువర్ణం, శ్రీరాజరాజేశ్వరి, జావళి, చంద్రచూడా, నవరస రామాయణ అంశాలను ప్రదర్శించి మెప్పించింది.