పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్యాయత్నం

పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్యాయత్నం

రాజకీయ పలుకుబడి, పదవి, మంత్రుల నుంచి సీఎం వరకు పరిచయాలు ఉండీ కూడా కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేయడం కాకినాడ జిల్లాలో కలకలం రేపింది. పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల మహాలక్ష్మి కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

మున్సిపల్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి, భర్త సుబ్రహ్మణ్యం, కొడుకు శ్రీకాంత్  నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య యత్నానికి  పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 

పెద్దాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైస్ చైర్మన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప పరామర్శించారు. పార్టీ పరంగా అండగా ఉంటామని, అన్ని విదాల ఆదుకుంటామని ధైర్యం చెప్పారు.