రాజ్యసభలో నవ్వులే నవ్వులు.. ఎందుకో తెలుసా..

రాజ్యసభలో నవ్వులే నవ్వులు.. ఎందుకో తెలుసా..

న్యూఢిల్లీ: యూనియన్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బడ్జెట్ 2024 పై చర్చిస్తున్న సందర్భంగా ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్.. మోదీ ప్రభుత్వం ఓ విచిత్రమైన కోరిక కోరారు. దీంతో రాజ్యసభ చైర్మన్ , ఉపరాష్ట్రపతి జగదీప్ థనకర్ తో సహా సభ్యులంతా నవ్వారు. 

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సభలో బడ్జెట్ తో మాట్లాడుతూ బడ్జెట్ లో జైళ్లకోసం కేవలం రూ. 300 కోట్లు మాత్రమే కేటాయించారు. జైళ్లకోసం బడ్జెట్ పెంచాలని మోదీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సభ సభ్యులంతా ఒక్కసారిగా నవ్వారు.ఈ ఆసక్తికర, హాస్యాస్పదమైన డిమాండ్ ను రాజ్యసభ చైర్మన్ కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇది చాలా భావోద్వేగ విజ్ణప్తి.. ఈ డిమాండ్ ను పరిగణలోకి తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పారు. 

ALSO READ | స్పీకర్​ వర్సెస్​ అభిషేక్​ బెనర్జీ .. లోక్​సభలో బడ్జెట్​పై చర్చ