ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వే లైన్​పై  కేంద్రం సానుకూలత

ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వే లైన్​పై  కేంద్రం సానుకూలత

నిర్మల్, వెలుగు: ఆర్మూర్–నిర్మల్–అదిలాబాద్ రైల్వే లైన్​పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఎంపీ ధర్మపురి అర్వింద్​తో కలిసి ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ను కలిసారు. ఈ సందర్భంగా రైల్వే లైన్ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోగా ఆయన సానుకూలంగా స్పందించారని, సర్వే పనులను చేపట్టేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రైల్వే లైన్ పనులు చేపడతామన్నారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నట్లు తెలిపారు.