
- 5వ తరగతి ఎంట్రెన్స్‌కు 88,451 మంది అప్లై
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరగనుంది. 5 నుంచి 9వ తరగతి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీల్లో ప్రవేశాల కోసం మొత్తం 51,968 సీట్లకు 1,67,649 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 5వ తరగతిలో ప్రవేశాల కోసం 88,451 మంది, 9వ తరగతిలో బ్యాక్ లాగ్ సీట్లకు 11, 871 మంది అప్లై చేసుకున్నారు.
గతేడాది కంటే ఈ సారి 15 వేలు అధికంగా అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 446 సెంటర్లలో ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఎగ్జామ్ జరగనుంది. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 100 మార్కులకు ఓఎంఆర్ పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కాగా..గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులందరూ పరీక్షకు హాజరు కావాలని కోరారు.