6న ఇంటర్ గురుకుల ప్రవేశ పరీక్ష

6న ఇంటర్ గురుకుల ప్రవేశ పరీక్ష
  • హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి
  • ఉదయం 10 నుండి 12.30 వరకు పరీక్ష
  • తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్

హైదరాబాద్: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2022 - 23 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను ఈనెల 6వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. 
ప్రవేశ పరీక్షను హైదరాబాద్ నగరంతోపాటు మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కేంద్రాలలో పరీక్ష జరుగుతుందని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వివరించారు. అభ్యర్థులు తాము డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉన్నట్లు గమనిస్తే.. సరైన ధృవపత్రాలు తీసుకుని తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలలో సంబంధిత అధికారతో సరిచేయించుకోవాలని ఆయన కోరారు. 

 

ఇవి కూడా చదవండి

లైవ్ అప్ డేట్స్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మోడీని కలిసిన నిఖత్ జరీన్, మనీశా మౌన్, పర్వీన్ హుడా

తెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కడుంది ?