ఎంట్రెన్స్ టు డాక్ట‌ర్ ఫ్రాక్టీస్

ఫారిన్ లో మెడిసిన్ చదివిన వారు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు కల్పించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌‌ఎం‌‌జీఈ) స్ర్కీనింగ్ టెస్ట్ నోటిఫికేషన్ ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) విడుదల చేసింది. ఎంసీఐ తరఫున నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌‌బీఈ) ఈ పరీక్ష నిర్వహిస్తుంది. కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఆలస్యం అయింది. జూలై 22 వరకు ఆన్‌‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31న పరీక్ష నిర్వహిస్తారు.

ఏమిటీ స్ర్కీనింగ్ టెస్ట్?

విదేశాల్లో మెడిసిన్ చదువుతున్న భారతీయులు, భారత సంతతి పౌరులు మనదేశంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలు కల్పించే పరీక్ష ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌‌ఎం‌‌జీఈ) స్ర్కీనింగ్ టెస్ట్. దీనిని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఏటా జూన్, డిసెంబర్ సెషన్లలో రెండు సార్లు నిర్వహిస్తుంది. ఎంసీఐ తరఫున నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌‌బీఈ) నిర్వహించే ఎఫ్‌‌ఎమ్‌‌జీఈ స్ర్కీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇతర రాష్ర్టాల మెడికల్ కౌన్సిల్స్ తో పర్మనెంట్ రిజిస్ర్టేషన్ పొంది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎంసీఐ రిజిస్ర్టేషన్ పొందిన వారు ఇండియాలో నిర్వహించే పరీక్షలు, ఉద్యోగాలకు అర్హులవుతారు.
ఎలిజిబిలిటీ
భారతీయులు, భారత సంతతి పౌరులు అయి ఉండి 2020 జూలై 31 నాటికి ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణత పొందినవారు అర్హులు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్ లో యూజీ పూర్తి చేసి పీజీ సీటు పొందినవారు లేదా ఆ దేశాల్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి లభించిన వారు ఈ స్ర్కీనింగ్ టెస్ట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు. అలాగే పాకిస్తాన్ లో మెడిసిన్ పాసయినవారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.6940.

టెస్ట్ ప్యాటర్న్

ఆన్‌‌లైన్ లో నిర్వహించే ఈ ఎగ్జామ్ లో ఒకే పేపర్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. మొత్తం ప్రశ్నలు 300. పరీక్ష ను రెండు పార్ట్స్ గా విభజించారు. ఒక్కో పార్ట్ లో 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 నిమిషాల వరకు పార్ట్‌‌-I, రెండు గంటల నుంచి నాలుగన్నర వరకు పార్ట్‌‌-II నిర్వహిస్తారు. అభ్యర్థులు క్వాలిఫై అవ్వాలంటే కనీసం 150 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆగస్టు 17 నుంచి అభ్యర్థుల సౌకర్యార్థం ఎన్‌‌బీఈ వెబ్‌‌సైట్ లో డెమో టెస్టులు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు, ముంబయి, పుణె, నోయిడా, నాగ్‌‌పూర్, న్యూఢిల్లీ, కోల్‌‌కతా.

ముఖ్య తేదీలు

దరఖాస్తుకు చివరితేది: 2020 జూలై 22
తప్పుల సవరణ: 2020 జూలై 23 నుంచి 25 వరకు
ఫొటో, సిగ్నేచర్ కరెక్షన్: 2020 ఆగస్టు 10 నుంచి 12
డాక్యుమెంట్స్ కరెక్షన్: 2020 ఆగస్టు 20
అడ్మిట్ కార్డ్: 2020 ఆగస్టు 24
పరీక్ష తేది: 2020 ఆగస్టు 31
వెబ్‌‌సైట్: www.nbe.edu.in, www.mciindia.org
ఈమెయిల్: helpdesknbeexam@gmail.com

మరిన్ని వార్త‌ల కోసం