హైదరాబాద్, వెలుగు: ఇంటింటా ఇన్నోవేటర్ 2024' ఆరో ఎడిషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం తెలిపింది. గ్రామాల నుంచి ఇన్నోవేషన్లను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల్లో ఉన్న ఆవిష్కర్తలు, ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో వారు, వారి అద్భుతమైన ఆలోచనలను, ప్రాజెక్టులను సమర్పించవచ్చు.
విజేతలకు ఆగస్టు 15న అవార్డులు అందజేస్తారు. ఆవిష్కర్తలు వారి దరఖాస్తులను నేరుగా వాట్సాప్ నంబర్ 9100678543కు పంపించవచ్చు. పేరు, వయసు, ఫోటో, వృత్తి, గ్రామం, మండలం, ఆవిష్కరణ పేరు, 100 పదాలలో ఆవిష్కరణ వివరణ, ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు ఫొటోలు, ఆవిష్కరణ విధులను ప్రదర్శించే రెండు వీడియోలు వచ్చే నెల మూడో తేదీలోపు పంపాలి.