వర్ని, వెలుగు: బాన్సువాడ నియోజకవర్గానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిందేమీ లేదని కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శించారు. మోస్రాలోని ప్రసిద్ధ రామ్మందిరంలో ఆయన గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో మండల కేంద్రం మోస్రాలో, గోవూరు, నెంబర్తండా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏనుగు మాట్లాడుతూ.. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ఇస్తామన్నారు. చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. 40 ఏండ్లుగా బాన్సువాడ రాజకీయాలను ఏలుతున్న పోచారం నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, ఆయన కుటుంబమే బాగు పడిందన్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఎలమంచిలి శ్రీనివాస్‌రావు, చందూరు జడ్పీటీసీ అంబర్ సింగ్, మోస్రా మండలాధ్యక్షుడు లక్ష్మణ్, హరి నారాయణ, ప్రవీణ్ గౌడ్, సైనిపురం నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.