గెలిపిస్తే ప్రశ్నించే గొంతునవుతా.. : రాకేశ్​రెడ్డి

  • బీఆర్ఎస్​గ్రాడ్యుయేట్స్​ఎమ్మెల్సీ అభ్యర్థి  రాకేశ్​రెడ్డి నామినేషన్​దాఖలు  
  • హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు

నల్గొండ, వెలుగు : నల్గొండ, ఖమ్మం, వరంగల్​పట్టభద్రుల శాసనమండలి స్థానానికి బీఆర్​ఎస్​ అభ్యర్థి ఏనుగుల రాకేశ్​రెడ్డి మంగళవారం నామినేషన్​వేశారు. దీనికి మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్గొండలో సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీయే లేదని, ఇండియా కూటమి రాదని..కేసీఆర్​చేతికి 16 ఎంపీ సీట్లు అప్పజెప్తే ఆ లెక్కే వేరుగా ఉంటుందన్నారు.

మండలి ఎన్నికల్లో రాకేశ్​రెడ్డిని గెలిపిస్తే ప్రశ్నించే గొంతుగా నిలుస్తాడన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్​స్థానం ఎప్పుడైనా బీఆర్​ఎస్​దేనన్నారు. రాకేష్​ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు చైతన్యవంతులని, తాను అమెరికాలో ఉద్యోగం వదలుకుని రాజకీయాల్లోకి వచ్చానని, బీజేపీ కాదంటే కేసీఆర్​తనను అక్కున చేర్చుకుని ఆదరించారన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను గెలిపిస్తే నిరుద్యోగులు, యువకులు, ఉద్యోగులు పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. ఎమ్మెల్సీలు ఎంసీ కో టిరెడ్డి, తాతా మధు, సత్యవతి రాథోడ్​, డీసీసీబీ చైర్మన్​ గొంగడి మహేందర్​ రెడ్డి పాల్గొన్నారు.