ఏనుమాముల మార్కెట్‌‌ నాలుగు రోజులు బంద్‌

ఏనుమాముల మార్కెట్‌‌ నాలుగు రోజులు బంద్‌

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​ నాలుగు రోజులు బంద్​ ఉంటుందని మార్కెట్​ సెక్రటరీ సంగయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జనవరి 13 నుంచి 16 వరకు మార్కెట్​యార్డు బంద్​ ఉంటుందన్నారు. తిరిగి 17న  ఓపెన్  అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.