
వరంగల్‌సిటీ, వెలుగు : వరంగల్ నగరంలోని ఏనుమాముల మార్కెట్‌ను మూడు రోజుల పాటు మూసివేయనున్నట్లు మార్కెట్ ఆఫీసర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికుల సమ్మె కారణంగా శుక్రవారం మార్కెట్ మూసివేస్తుండగా, శని, ఆదివారాల్లో వారాంతపు సెలవుల కారణంగా మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. ఈ మూడు రోజుల్లో రైతులు తమ సరుకును మార్కెట్‌ను తీసుకురావద్దని సూచించారు. సోమవారం తిరిగి కొనుగోళ్లు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.