కేయూసీ, వెలుగు: హనుమకొండ కేయూ రోడ్డులోని ఏకశిల హైస్కూల్లో బుధవారం పర్యావరణ దీపావళి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు, టీచర్లు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. రంగురంగుల పూలు, ప్రమిదలతో అలంకరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే వాతావరణ కాలుష్యానికి దూరంగా దీపావళి పండుగ నిర్వహించుకుంటూ ఆదర్శంగా నిలవాలన్నారు. డైరెక్టర్ బేతి కొండల్‌రెడ్డి, ప్రిన్సిపల్ శైలజ రెడ్డి, టీచర్లు వేణుగోపాల్, స్వప్న, స్వాతి, కల్పన, సుమలత, మమత, లక్ష్మి, స్వాతి, వైశాలి, నాగలక్ష్మి పాల్గొన్నారు.