ప్లాస్టిక్​ నియంత్రణ మనచేతుల్లోనే..

ప్లాస్టిక్​ నియంత్రణ మనచేతుల్లోనే..

పచ్చదనం పరుచుకున్న పచ్చిక బయళ్లు, ఆహ్లాదాన్ని పంచే అరణ్యాలు, ఉప్పొంగే కడలి కెరటాలు, పరవళ్లు తొక్కే నదీ జలాలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, ప్రకృతిలోని అందాలు చూడముచ్చ టైనవి. కానీ, విజ్ఞానవంతుడైన మానవుడు దానవుడిలా మారిపోయాడు. 

దీని వలన పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్లాస్టిక్ నేలలో కలవాలంటే 100 ఏండ్లు పడుతుంది. ఆవులు, మేకలు నేలపై పడ్డ ప్లాస్టిక్ సంచులను తిని మృత్యువాత పడుతున్నాయి.  మరోవైపు నదులలో, కాలువల్లో, చెరువుల్లో ప్లాస్టిక్​ చెత్త పార వేస్తే నీరు కలుషితమవుతుంది. 

దీనితో జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్​ను కాల్చితే ప్రమాదకరమైన విషవాయువులు వెలువడి  మనిషి ప్రాణాంతానికి గురి అవుతున్నాడు. సాధారణ ఉష్ణోగ్రతలూ పెరుగుతున్నాయి. అకాల వర్షాలు పడుతున్నాయి. 

అస్సాం రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థ్యాలను సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు. భూమిపై ప్రాణులు, జలచరాలు, పక్షులు, సురక్షితంగా జీవించాలి అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై, ప్రభుత్వంపై ఉంది.  

ఇంట్లోకి రోజూ మనం తెచ్చే  ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థా​లను  చెత్తకుండీలో వేయకుండా ఒక పెద్ద బాటిల్​లో పెట్టి చెత్తబండికి ఇస్తే.. కనీసం ప్లాస్టిక్​ వ్యర్థాలు భూమిపై విస్తరించకుండా ఉంటాయి. గుడ్డిలో మెల్ల ఈ పనైనా మనం చేస్తే పర్యావరణానికి ఎంతోమేలు చేసినవారమవుతాం.​ 

అలాగే, మార్కెట్​కు వెళ్లినపుడు వస్త్ర సంచులను తీసుకుపోయినా.. కొన్నైనా ప్లాస్టిక్​ క్యారీ బ్యాగులను వాడకుండా ఆపగలుగుతాం.  ఆవిధంగా ప్లాస్టిక్​ నియంత్రణ అనేది మన చేతుల్లోనూ ఉందని గమనిద్దాం.
 సయ్యద్ షఫీ. హనుమకొండ