పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్​లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మానవ మనుగడ సాగాలంటే పర్యావరణం దెబ్బతినకుండా చూసుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని వక్తలు అన్నారు. అంతా కలిసి మొక్కలు నాటారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసిన అధికారులు.. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఏం చేయకూడదో ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులను కాపాడుకోవాలని, మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ ​వాడకాన్ని తగ్గించుకోవాలని కోరారు. పర్యావరణాన్ని రక్షించుకుందామని నినదిస్తూ ర్యాలీలు నిర్వహించారు.  

- వెలుగు, నెట్​వర్క్