హైదరాబాద్: గొలుసుకట్టు చెరువులు, కాలువల పరిరక్షణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పర్యావరణవేత్త పురుషోత్తమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా చొరవను ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి అభినందించారు.
పీసీబీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సహకారంతో హైడ్రా లక్ష్యాలు చేరుకోవడం సులభమని పురుషోత్తం రెడ్డి అభిప్రాయపడ్డారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యల గురించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. చెరువుల పరిరక్షణే కాదు.. కాలుష్య కారణాల పైనా దృష్టి పెట్టాలన్న పురుషోత్తమ్ రెడ్డి సూచించారు.
వర్షపు నీటి పరిరక్షణ, నీటితో నిండిన చెరువులు, భూగర్భ జలాలు, భూమి పొడిగా మారకుండా.. భూమి కాలుష్యమయం అవకుండా హైడ్రా కాపాడాలని ప్రొఫెసర్ సూచించారు. జహీరాబాద్ దగ్గరలోని కొహిర్ మండలం గొట్టిగారిపల్లెలో చెరువులను పరిరక్షించుకునే విధానం బాగా జరిగిందని, ఎలాంటి నీటి వనరులు లేని గ్రామంలో ఇప్పుడు మూడు పంటలు పండిస్తున్నారని, చెరువుల పరిరక్షణ తీరును పరిశీలించాలని పురుషోత్తమ్ రెడ్డి సూచించారు.