
కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ.90,21,539 వచ్చింది. గురువారం ఈవో బాలాజీ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా 76 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందన్నారు. మిశ్రమ బంగారం 99 గ్రాములు, వెండి 10 కిలోల 200 గ్రాములు, బియ్యం 1,400 కిలోలు, విదేశీ కరెన్సీ నోట్లు 26 వచ్చాయి.
ఈ మొత్తాన్ని స్థానిక ఏపీజీవీబీలో జమచేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భిక్షపతి, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగ శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, స్థానాచార్యులు పడిగన్నగారి మల్లయ్య, ధర్మకర్తలు, సిబ్బంది, రామ కృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.