కాళేశ్వరం టెంపుల్ లో కుంభాభిషేకానికి సర్వం సిద్దం

కాళేశ్వరం  టెంపుల్ లో కుంభాభిషేకానికి సర్వం సిద్దం

మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం టెంపుల్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహా కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తి  చేశామని ఈవో మారుతి తెలిపారు. 

గురువారం   ప్రెస్ మీట్ లో మాట్లాడతూ..  ఉదయం 6 గంటలకు  త్రివేణీ సంగమం నుంచి పవిత్ర జలాలు తీసుకురావడంతో కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. మూడురోజులపాటు  ఆచ్చలాపురం నుంచి 50 మంది వేదపండితులు రానున్నారని తెలిపారు. 9 న  మహా కుంభాభిషేకం తుని పీఠాదిపతి  సచ్చిదానంద సరస్వతి చేతుల మీదుగా జరుగుతుందని చెప్పారు.