కామారెడ్డి, వెలుగు: తాడ్వాయి మండలం నందివాడ జడ్పీ హైస్కూల్ టీచర్ దశరథ్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు గురువారం కామా రెడ్డి డీఈవో రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టీచర్పై క్రిమినల్ కేసు నమోదైన దృష్ట్యా సస్పెండ్ చేశామన్నారు.
దశరథ్ రెడ్డి చిట్ కంపెనీలో డైరెక్టర్గా ఉండి చిట్టి ఎత్తుకున్నవ్య క్తికి అమౌంట్ చెల్లించకపోవటంతో బాధితుని ఫిర్యాదుపై ఇతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.