తెలంగాణకు తిరుమల షాక్.. సిఫార్సు లేఖపై నిర్ణయం తీసుకోలేదన్న ఈవో

 తెలంగాణకు తిరుమల షాక్.. సిఫార్సు లేఖపై నిర్ణయం తీసుకోలేదన్న ఈవో

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను స్వీకరిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ లీడర్ల విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించి వారంలో రెండు రోజులు సిఫారసు లేఖలు స్వీకరించేందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయ నాయకుల సిఫారసు లేఖల స్వీకరణపై టీటీడీ ఈవో శ్వామల రావు కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరిస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. 

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తెలిపారు. మీడియాలో అలా ప్రచారం జరుగుతోందని.. కానీ తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల స్వీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈవో శ్యామల రావు వివరణ ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేతం తిరుమలలో తెలంగాణ లీడర్ల సిఫారసు లేఖలు స్వీకరించకపోవడంపై రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ టీటీడీ తీరును బహిరంగంగానే తప్పుబట్టారు.

ALSO READ : తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు..

 తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ లీడర్ల సిఫారసు లేఖలు స్వీకరించేందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. వారంలో రెండు రోజులు సిఫారసు లేఖలపై దర్శనానికి అవకాశం కల్పించినట్లు మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ ఈవో శ్యామల రావు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల స్వీకరణపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ లీడర్ల లేఖలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.