నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో స్వామివారి విగ్రహాలకు అభిషేకం జరుగుతుండగా.. ఆలయల ఈవో వేణు దర్జాగా అందులో స్విమ్మింగ్ చేశారు. పుష్కరిణిలో ఈత కొట్టద్దంటూ అర్చకులు చెబుతున్నప్పటికీ వేణు అవేమి పట్టించుకోకుండా ఈత కొట్టినట్లు తెలుస్తోంది.
దక్షిణ కాశీగా నీలకంటేశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. అలాంటి ఆలయ పుష్కరిణిలో, అదికాక దేవుని విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తున్న టైమ్ లో ఈత కొట్టడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
వేణు మొత్తం నాలుగు ఆలయాలకు ఇంఛార్జ్ ఈవోగా పనిచేస్తున్నారు. అలాంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న అధికారి.. ఇలా పుష్కరణిలో దేవునికి అభిషేకం చేస్తుండగా ఈత కొట్టడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వేణుపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి .