![వేములవాడ రాజన్న భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు : ఈవో వినోద్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/eo-vinod-reddy-said-arrangements-are-being-made-for-devotees-of-rajanna-without-any-problems_FrX7jEafo5.jpg)
వేములవాడ, వెలుగు: మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా రాజన్నను తొందరగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఇంజినీరింగ్, ఉద్యోగులతో కలిసి ఆలయ పరిసరాలు, దర్శనం, కోడె మొక్కుల క్యూలైన్లు, ఉచిత టిఫిన్, భోజనం, లడ్డూ కౌంటర్, సులభ్ కాంప్లెక్స్, పార్కింగ్ ఏరియా, చలువ పందిళ్ల ఏర్పాటును పరిశీలించారు.
సామాన్య భక్తులు స్వామిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 25 నుంచి 27 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి జాతరకు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈవో వెంట ఈఈ రాజేశ్, డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈలు, సిబ్బంది
ఉన్నారు.
కోడె మొక్కు చెల్లించిన విదేశీ భక్తురాలు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్నను అమెరికాకు చెందిన భక్తురాలు బుధవారం దర్శించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వీరభద్రరావు, తన భార్య పీటర్(అమెరికా), తల్లిదండ్రులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కు చెల్లించారు. .