కోల్బెల్ట్, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో ఖాళీగా ఉన్న ఈపీ ఆపరేటర్ట్రైనీ(కేటగిరీ5) పోస్టులను 100కు పెంచినట్లు సింగరేణి జీఎం(సెక్యూరిటీ, పర్సనల్, వెల్ఫేర్,ఆర్సీ) బీఆర్. దీక్షితులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్నల్అభ్యర్థులతో 60 పోస్టులను భర్తీ చేయడానికి మొదట నోటిఫికేషన్రిలీజ్చేసినట్లు చెప్పారు. ఇప్పుడు వాటి సంఖ్యను 100కు పెంచినట్లు చెప్పారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించామన్నారు. అందులో 828 మంది ఉత్తీర్ణులయ్యారని ..వారికి ఈ నెల 30న కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ మహిళా డిగ్రీ అండ్పీజీ కాలేజీలో ఫైనల్ రాతపరీక్ష ఉంటుందన్నారు. రాత పరీక్ష అనంతరం అదే రోజు అసెస్మెంట్ మార్కులు, డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ పరీక్ష మార్కులు కలిపి ఫైనల్ లిస్ట్ ను హెడ్ ఆఫీసు నోటిస్ బోర్డుపై ఉంచుతామన్నారు.
మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానిక అభ్యర్థులకు కేటాయించిన రిజర్వేషన్ అనుసరించి 100 ఈపీ ఆపరేటర్ ట్రైనీ ( కేటగిరీ-5) పోస్టుల ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఎంపిక ప్రక్రియలన్నీ పారదర్శకంగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.