EPF ఖాతాదారులకు బిగ్ షాక్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) కోవిడ్ చికిత్స అడ్వాన్స్ కింద నగదు బదిలీని నిలిపివేసింది. కోవిడ్ మహమ్మారి ఇప్పుడు లేనందున అడ్వాన్స్ నగదు బదిలీని నిలిపివేస్తున్నామని ఈ నిబంధన తక్షణమే అమలులోకి వస్తుందని జూన్ 12 న విడుదల చేసిన ఓ నోటిఫికేషన్ విడుదల తెలిపింది. ఇది మినహాయింపు పొందిన ట్రస్టులకు కూడా వర్తింది.
ఇదివరకు కోవిడ్ 19 ఆర్థిక అవసరాల కారణంగా ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులు రెండు సార్లు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో EPF సభ్యులకు అడ్వాన్స్ ను తీసుకునేలా EPFOఅవకాశం కల్పించింది. తర్వాత మే 31,2021 నుంచి అమలులోకి వచ్చిన కోవిడ్ రెండో వేవ్ లో మరొక అడ్వాన్స్ కు అవకాశం ఇచ్చారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ యోజన (PMGKY) ద్వారా మొదట మార్చి 2020లో ప్రవేశపెట్టింది. జూన్ 2021లో లేబర్ మినిస్ట్రీ ద్వారా రెండో నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు EPF సభ్యులకు ఒక్క అడ్వాన్స్ మాత్రమే తీసుకునేలా అనుమతిచ్చారు.
EPF చందాదారులు ముందుగానే ఖాతా బ్యాలెన్స్ డ్రా చేసుకోవచ్చు ఎలా అంటే..
- గృహ రుణం,
- లాకౌట్ లేదా ఫ్యాక్టరీ మూసివేత,
- కుటుంబ సభ్యుల చందాదారుల అనారోగ్యం,
- కొడుకు, కుమార్తె, సోదరుడు, సోదరి వివాహం,
- పిల్లల పోస్ట్ మెట్రిక్యూలేషన్ విద్య,
- సహజ విపత్తు,
- స్థాపనలో విద్యుత్ కోత,
- దివ్యాంగులకు పరికరాలు కొనుగోలు,
- పదవీ విమరణకు ఒక సంవత్సరం ముందు,
- వరిష్ట పెన్షన్ బీమా యోజనలో పెట్టుబడి పెట్టడం కోసం
ఇలాంటి సందర్భాల్లో EPF చందాదారులు తమ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
PF మొత్తాన్ని డ్రా చేసుకోవాలంటే..
PF మొత్తాన్ని డ్రా చేసుకోవాలంటే పదవీ విమరణ సమయం లేదా ఉద్యోగం నుంచి విమరణ పొంది రెండు నెలల తర్వాత మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. మీ అర్హతలు చెక్ చేసుకున్న తర్వాత పర్సనల్ డిటెయిల్స్ అప్డేట్ చేసి UAN ని యాక్టివేట్ చేసుకోవాలి. పాక్షిక లేదా మొత్తం పీఎఫ్ విత్ డ్రా కోసం EPF ఫారం నింపాలి.
ఆన్ లైన్ లో ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే...
- EPFO అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి UAN , పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి. KYC పూర్తి చేయాలి
- మీరు పాక్షిక లేదా మొత్తం PF విత్ డ్రా చేస్తున్నారా అనేది నిర్ధారించుకొని ఎంచుకోవాలి.
- క్లెయిమ్ ఫాంలో అడిగిన బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డు, పాన్ కార్టు, అడ్రసు వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
- UDAIనుంచి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు OTP వస్తుంది.
- OTP ఎంటర్ చేసి ఆన్ లైన్ ద్వారా క్లెయిమ్ ఫారం సమర్పించబడినట్టు నిర్దారించబడుతుంది.