
EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్..ప్రావిడెంట్ ఫండ్(PF) ను విత్ డ్రాను మరింత సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా UNI ద్వారా ఖాతాదారులు పీఎఫ్ ను విత్ డ్రా చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
వచ్చే 3 నెలల్లో GPay, PhonePe ,Paytmతో సహా UPI ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఫీచర్‌ను విడుదల చేయడానికి EPFO నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో చర్చలు జరుపుతోంది.ప్రణాళికను అమలు చేయడానికి EPFO ఒక బ్లూప్రింట్‌ను కూడా సిద్ధం చేసింది.
ప్రస్తుతం EPFO ఖాతాదారులు తమ నిధులను బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేయడం ద్వారా విత్ డ్రా చేసుకుంటారు. దీనికి కొద్దిరోజుల సమయం పడుతుంది. కొత్త సిస్టమ్ ప్రకారం UPI ఆధారిత లావాదేవీలను ప్రారంభించనుంది. ఖాతాదారులు లింక్ చేయబడిన UPI ID కి తక్షణ నగదు బదిలీకి అనుమతినిస్తుంది.
ఈ చర్య ముఖ్యంగా అత్యవసరంగా డబ్బు అవసరం పడినప్పుడు పీఎఫ్ ఖాతాదారులకు ఇది మంచిగా ఉపయోగపడుతుంది. త్వరిత గతిన యాక్సెస్ ద్వారా ఉద్యోగు లకు ప్రయోజనం చేకూరుతుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇప్పటివరకు EPFO ఇప్పటికే 7.4 కోట్ల మంది ఖాతాదారులకు సంబంధించిన 50 మిలియన్లకు పైగా క్లెయిమ్‌లను పరిష్కరించింది. రూ. 2.05 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది.