త్వరలో ఈపీఎఫ్ఓ 3.0.. పీఎఫ్ అప్లికేషన్ల పరిస్కారం మరింత వేగవంతం

త్వరలో ఈపీఎఫ్ఓ 3.0.. పీఎఫ్ అప్లికేషన్ల పరిస్కారం మరింత వేగవంతం

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) త్వరలో ఈపీఎఫ్ఓ ​​3.0 పేరుతో ఒక కొత్త సిస్టమ్​ను ప్రారంభించనుంది. దీంతో పీఎఫ్ చందాదారుల అప్లికేషన్లు మరింత వేగంగా పరిష్కారమవుతాయి. ఏటీఎంల నుంచి కూడా డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 

ఈ ఏడాది మే లేదా జూన్​లో ఈ కొత్త వెర్షన్​ను అందుబాటులోకి తెస్తామని కేంద్ర కార్మికశాఖ తెలిపింది. దీనివల్ల  ప్రస్తుతం ఉన్నదానికంటే చాలా తక్కువ సమయంలో పీఎఫ్ క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పరిష్కారమవుతాయి.  ఏటీఎం విత్​డ్రాయల్స్​కోసం ప్రత్యేక కార్డులు ఇస్తారు.