
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) లో ఈ ఏడాది ఫిబ్రవరిలో నికరంగా 16.10 లక్షల మంది జాయిన్ అయ్యారు. కిందటేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఇది 3.99 శాతం ఎక్కువ. ఇందులో కొత్తగా జాయిన్ అయినవారు 7.39 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం, 18–-25 ఏళ్ల వయస్సు గల వారు ఎక్కువగా ఈపీఎఫ్‌ఓలో జాయిన్ అయ్యారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా జాయిన్ అయిన వారిలో ఈ ఏజ్ గ్రూప్‌కు చెందిన వారు 4.27 లక్షల మంది ఉండగా, వీరి వాటా 57.71 శాతానికి చేరుకుంది. సుమారు 2.08 లక్షల మంది కొత్త మహిళా సబ్‌స్క్రయిబర్లు ఈపీఎఫ్‌ఓలో చేరారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు.