సాధారణంగా పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని తెలుసు. ముఖ్యంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా UAN నంబర్ కు జత చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం చాలా కష్టం..అయితే EPFO కొద్ది మంది ఉద్యోగులు/వర్కర్లకు ఈ నిబంధనలను సడలించింది.. ఆ వర్కర్లు ఎవరు ఎందుకు ఈ నిబంధనలు సడలించిందో తెలుసుకుందాం..
ALSO READ | ఈఎల్‌ఐ కోసం యూఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల ఓ ప్రకటన చేసింది. పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం కొన్ని రకాల ఉద్యోగులు/వర్కర్లు ఆధార్ కార్డు తప్పనిసరిగా సీడ్ చేయాల్సిన అవసరం లేదని ఈ ప్రకటనలో తెలిపింది. సాధారణంగా పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ కు ఈపీఎఫ్ వో ఖాతాదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డును UAN సీడ్ చేయాలి. అయితే నవంబర్ 29న జారీ చేసిన సర్క్యూలర్ లో ఈ కింద తెలిపిన ఉద్యోగులు/వర్కర్లకు ఆధార్ సీడింగ్ నిబంధనలు సడలించింది.
- భారత్ కు చెందిన అంతర్జాతీయ కార్మికులు
- విదేశాల్లో స్థిరపడిన ఇండియన్ వర్కర్స్
- ఇండియాలో ఉద్యోగులు గుర్తించ బడిన నేపాల్ పౌరులు, భూటన్ కు చెందిన పౌరులు
- వీరంతా పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందు తమ ఆధార్ కార్డును EPFO లోUAN నంబర్ తో జత చేయాల్సిన అవసరం లేదు.
- మిగతా EPFO ఖాతాదారులంతా తప్పనిసరిగా UAN కు ఆధార్ నంబర్ ను సీడ్ చేసుకోవాలి.