పదేళ్ల సర్వీస్కు EPS ప్రకారం ఎంత పెన్షన్ వస్తుంది..?

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహించే ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ ( EPS) పథకం భారత్ లో అతిపెద్ద సామాజిక భద్రత పథకం. ఈ స్కీమ్ కింద ఉద్యోగుల సర్వీస్ ఆధారంగా నెల నెల పెన్షన్ పొందుతారు. 1995 నవంబర్ 16న కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం ను ప్రారంభించింది. ఆర్గనైజ్ డ్ సెక్టార్ (సంఘటిత) లో పనిచేసే ఉద్యోగులకు రెగ్యులర్ ఇన్ కమ్ అందించలానే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 

మఖ్యమైన అంశాలు:

పెన్షన్ కు అర్హులు కావాలంటే కనీస సర్వీసు: 10 సంవత్సరాలు

పెన్షన్ వయసు: 58 సంవత్సరాలు

నెలవారీగా కనిష్ట పెన్షన్: రూ.1,000

నెలవారీగా గరిష్ట పెన్షన్: రూ. 7,500

 EPF కు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఎంత:

 EPS మెంబర్స్ లేదా ఉద్యోగులు పెన్షన్ స్కీం కోసం తమ బేసిక్ పే నుంచి 12 శాతం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అంటే బేసిక్ సాలరీ నుంచి 12 శాతం కట్ అవుతుంది. కంపెనీ రెండు భాగాలుగా కంట్రిబ్యూట్ చేస్తుంది. EPS కు 8.33 శాతం,  EPF స్కీమ్ కు 3.67 శాతం ఇస్తుంది. అయితే 2014 నుంచి  EPS-1995 కనిష్ట పెన్షన్ నెలకు రూ.1000 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని 7,500 రూపాయల వరకు పెంచాలనే డిమాండ్ వస్తోంది చాలా కాలంగా వస్తోంది.

పదేళ్ల సర్వీస్ కు పెన్షన్ ఎంత వస్తుంది.. ఎలా లెక్కించాలి..?

ఫార్ములా = (పెన్షనర్ శాలరీ x పెన్షనర్ సర్వీస్)/70

 పెన్షనర్ శాలరీ = గత 60 నెలలుగా సరాసరి శాలరీ
పెన్షనర్ సర్వీస్ = EPS కు కంట్రిబ్యూట్ చేసిన మొత్తం సర్వీస్ (సంవత్సరాలలో)

ఉదాహరణకు ఒక ఉద్యోగి పెన్షనేబుల్ శాలరీ రూ.15000 అనుకుంటే సర్వీస్ 10 ఏండ్లు అనుకుంటే.. 
నెలవారీ పెన్షన్ = (15000x10)/7 = రూ.2143.

ముందస్తు పెన్షన్ ఎలా పొందాలి?

పెన్షన్ ఎవరికైనా 58 ఏండ్ల తర్వాత వస్తుంది. తొందరగా పెన్షన్ తీసుకోవాలనుకేంటే.. అంటే 58 ఏండ్లకంటే ముందే తీసుకోవాలంటే.. పెన్షన్ నిబంధనలకు అర్హత కలిగి ఉండాలి. కనీస వయసు 50 ఏండ్లు ఉండాలి. అలాగే కనీసం 10 ఏండ్ల సర్వీస్ ఉండాలి. అప్పుడు ముందస్తుగా పెన్షన్ పొందవచ్చు. అయితే ముందస్తు పెన్షన్ రావాలంటే రావాల్సిన మొత్తం పెన్షన్ నుండి సంవత్సరానికి 4 శాతం కట్ అవుతుంది. అంటే తగ్గిపోతుంది. 

ALSO READ | ఈ డంప్లింగ్​ మేకర్​తో చాలా ఈజీగా గరిజెలు చేసుకోవచ్చు

ఎక్కువ పెన్షన్ రావాలంటే?

ఎక్కువ పెన్షన్ రావాలంటే ఎక్కువ సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అదేవిధంగా ఎక్కువ జీతం ఉంటే పెన్షన్ ఎక్కువగా వస్తుంది. దీని వలన చాలా రోజులు పెన్షన్ తీసుకోవచ్చు. పెన్షన్ స్కీం కు పనిచేసే కంపెనీ నుంచి ఎలాంటి అంతరాయం కలగకుండా రెగ్యులర్ గా ఈపీఎఫ్ చెల్లించేలా చూసుకోవాలి. ఒకవేళ అర్హత ఉంటే.. ఎక్కువ పెన్షన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.