
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) రెగ్యులర్ ప్రాతిపదికన 185 స్టెనోగ్రాఫర్(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పన్నెండో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్టెనోగ్రఫీ స్కిల్ ఉండాలి. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో -800 మార్కులకు జరుగుతుంది. జనరల్ ఆప్టిట్యూడ్(50 ప్రశ్నలు), జనరల్ అవేర్‌నెస్(కంప్యూటర్ అవేర్‌నెస్‌తో సహా 50 ప్రశ్నలు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్(100 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.
దరఖాస్తులు: ఆన్లైన్లో ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.epfindia.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.