నామినీల పేర్లను వెంటనే ఇవ్వాలె

నామినీల పేర్లను వెంటనే ఇవ్వాలె
  • ఈ నెల 31 వరకే చాన్స్
  • లేకపోతే ఇబ్బందులు తప్పవు
  • ప్రకటించిన ఈపీఎఫ్ఓ

న్యూఢిల్లీ: తమ ఖాతాదారులంతా ఈ నెల 31లోపు వారి నామినీల పేర్లను తప్పక అందజేయాలని ఈపీఎఫ్ఓ కోరింది. వచ్చే నెల నుంచి కొత్త నిబంధన అమలులోకి రానున్నందున ఈనెలలోనే తమ ఖాతాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. నామినీ పేర్లను ఇవ్వకుంటే సంస్థ అందించే అనేక ప్రయోజనాలను కోల్పోతారని స్పష్టం చేసింది. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్‌‌‌‌లైన్‌‌లోనే నామినీ పేర్లను చేర్చవచ్చు. మనదేశంలో దాదాపు ఉద్యోగులందరికీ పీఎఫ్ ఖాతాలు ఉన్నాయి.  అయితే, డిసెంబరు 31లోపు ఉద్యోగి నామినీ వివరాలను అప్‌‌డేట్ చేయకుంటే,  వచ్చే నెల నుండి పెన్షన్,  బీమా సొమ్ముతో సహా ఎలాంటి ప్రయోజనాలను పొందడం సాధ్యం కాదు. ఖాతాదారుడికి ఏమైనా అయితే.. మరణానంతరం తన జీవిత భాగస్వామి, పిల్లలు  తల్లిదండ్రులకు డెత్‌‌ బెన్‌‌ఫిట్స్ అందించడానికి నామినీ పేర్లను ఇవ్వడం చాలా ముఖ్యమని ఈపీఎఫ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది.   పీఎఫ్ ఖాతాదారుడికి ఏదైనా జరిగితే, నామినీలకు  బీమా,  పెన్షన్ వంటివి చెల్లిస్తారు. ఈపీఎఫ్ పథకం ద్వారా ఇతర ప్రయోజనాలూ ఉంటాయి.  ఇంటి నిర్మాణం, పెండ్లి, అనారోగ్యం, ఉన్నత విద్య వంటి ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని లోన్ గా లేదా అడ్వాన్సుగా తీసుకోవచ్చు.

ఆన్‌‌లైన్‌‌లో ఈపీఎఫ్ నామినేషన్ ఫైల్ చేయడం ఇలా
1.    ఇంటర్నెట్ బ్రౌజర్‌‌ ఓపెన్‌‌ చేసి ఈపీఎఫ్‌‌ అఫీషియల్‌‌ వెబ్‌‌సైట్‌‌ epfindia.gov.in కు వెళ్లాలి
2.    అందుబాటులో ఉన్న ఆప్షన్లలో ‘సర్వీస్’ ట్యాబ్‌‌పై క్లిక్ చేయాలి. 
 3.    ఇప్పుడు కొత్త ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ‘ఫర్ ఎంప్లాయీస్’ అనే ట్యాబ్ నొక్కాలి.
 4.    మెంబర్ యూఏఎన్/ ఆన్‌‌లైన్ సర్వీస్ (ఓసీఎల్/ఓటీపీ)పై క్లిక్ చేయాలి
 5.    మీరు ఇంతకు ముందు సెట్ చేసిన యూఏఎన్,  పాస్‌‌వర్డ్‌‌తో లాగిన్ కావాలి
 6.    'మేనేజ్ ట్యాబ్' కింద 'ఈ-–నామినేషన్' రీడింగ్ ఆప్షన్‌‌పై క్లిక్ చేయాలి
 7.    ‘ప్రొవైడ్ డీటెయిల్స్‌‌’  పేరుతో ఒక ట్యాబ్ మీ స్క్రీన్‌‌పై కనిపిస్తుంది. తరువాత ‘సేవ్’పై క్లిక్ చేయండి.
 8.    కుటుంబ వివరాలను అప్‌‌డేట్ చేయడానికి ‘యెస్’ ఆప్షన్‌‌పై నొక్కండి. 'యాడ్ ఫ్యామిలీ డీటెల్స్’పై క్లిక్ చేసి, అవసరమైన సమాచారాన్ని పూరించండి.  ఒకరి కంటే ఎక్కువ నామినీలను చేర్చవచ్చు.
9.    ఇప్పుడు వాటా వివరాలను ఇవ్వడానికి ‘నామినేషన్ డీటెయిల్స్’ క్లిక్ చేయాలి. ఇప్పుడు ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి
10.    మీ ఆధార్ నంబర్‌‌కి లింక్ అయిన మొబైల్ నుంచి ఓటీపీ రావడానికి  ‘ఈసైన్’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేయగానే ఈ–-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. ఖాతాదారులు తమ సంస్థకు ఎలాంటి పత్రాలనూ పంపాల్సిన అవసరం లేదు.