2024లో EPFO చందాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏడాది కాలంలో దాదాపు అరకోటి సభ్యులు పెరిగారు. 2023-24 సంవత్సంలో EPFO సభ్యులు సంఖ్య 7.37 కోట్లకు చేరింది.
ఇది అసంఘటిత రంగంలో పెరుగుతున్న ఉపాధి, వ్యాపారానికి సూచికగా చెప్పొచ్చు. 2022-23లో 6.85 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. 2023--24లో 7.6 శాతం పెరిగి మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరింది.
సంఘటిత కార్మిక రంగంలో ఉద్యోగులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం కారణంగా వారి సంఖ్య పెరుగుదల సూచిస్తోంది. శుక్రవారం ( నవంబర్ 9) లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ సెక్రటరీ సుమిత్రా దావ్రా అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
EPFO బకాయిల రికవరీలో పెరుగుదల
EPFO బకాయిల రికవరీలో కూడా 55.4 శాతం పెరుగుదల చూసింది. బకాయిల రికవరీ రూ. 5268 కోట్లకు పెరిగింది. గతేడాది రూ.3390 కోట్లుగా ఉంది. గతేడాదితో పోల్చితే సెటిల్ అయిన క్లెయిమ్‌ల సంఖ్య కూడా 7.8 శాతం పెరిగి 4.45 కోట్లకు చేరుకుంది. గతేడాది రూ.4.12 కోట్లు అంటే క్లెయిమ్ సెటిల్ మెంట్ ప్రక్రియ కూడా వేగవంతమైంది.