గుడ్ న్యూస్: యూపీఐతో పీఎఫ్ విత్‌‌డ్రా

గుడ్ న్యూస్: యూపీఐతో పీఎఫ్ విత్‌‌డ్రా

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్‌‌ ఇంటర్‌‌‌‌ఫేస్‌‌ (యూపీఐ) ద్వారా పీఎఫ్ అమౌంట్‌‌ను విత్‌‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్  ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌‌ఓ) త్వరలో అందుబాటులోకి తేనుంది. గూగుల్‌‌పే, ఫోన్‌‌పే, పేటీఎం వంటి యాప్‌‌లలో ఈ కొత్త ఫీచర్‌‌‌‌ అందుబాటులోకి తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌‌పీసీఐ) తో చర్చలు జరుపుతోంది. రానున్న రెండుమూడు నెలల్లో ఈ కొత్త ఫీచర్ లాంచ్ అవుతుంది. 

ప్రస్తుతం  పీఎఫ్ విత్‌‌డ్రా నెఫ్ట్‌‌, ఆర్‌‌‌‌టీజీఎస్‌‌ ద్వారా జరుగుతున్నాయి.  ప్రాసెసింగ్‌‌కు కనీసం 2–3  రోజులు పడుతోంది. అదే కొత్త ఫీచర్‌‌‌‌ లాంచ్ అయితే ఈపీఎఫ్‌‌ఓ మెంబర్ల   యూపీఐ ఐడీకి ఫండ్స్ వెంటనే ట్రాన్స్‌‌ఫర్ అవుతాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ఈపీఎఫ్‌‌ఓ 7.4 కోట్ల ఉద్యోగులకు చెందిన 5 కోట్లకు పైగా క్లెయిమ్‌‌లను సెటిల్ చేసింది. రూ.2.05 లక్షల కోట్లను వీరి అకౌంట్లలో వేసింది.