EPFO withdrawal: కంపెనీ అప్రూవల్ లేకుండానే PF విత్ డ్రా చేసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదిగో..

EPFO withdrawal: కంపెనీ అప్రూవల్ లేకుండానే PF విత్ డ్రా చేసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదిగో..

EPFO withdrawal: EPF పెన్షన్దారులకు తమ పీఎఫ్ను ఎక్కడ నుంచైనా విత్డ్రా చేసుకునేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అవకాశం కల్పిస్తోంది. మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇం డ్ల కొనుగోలు వంటి ఎంప్లాయీ అవసరాల కోసం పెన్షన్ దారులు తమ డబ్బును డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఇటీవల పీఎఫ్ విత్ డ్రా విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ ఫండ్ విత్ డ్రా లిమిట్ ను రూ.50వేల నుంచి రూ.1లక్షా రూపాయలకు పెంచింది. దీంతోపాటు పెన్షన్ దారులకు మరో వెసులుబాటు కూడా ఉంది. అదేంటంటే..కంపెనీ అనుమతి లేకుండానే ఎక్కడైనా.. ఎప్పుడైనా పీఎఫ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.

PF విత్ డ్రాకు కావాల్సిన డాక్యుమెంట్లు

యూనివర్సల్ ఖాతా సంఖ్య(UAN): ఇది PF ఖాతాల కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్య.. ఇది ప్రతి ఎంప్లాయికి ఉంటుంది. 
బ్యాంకు అకౌంటు వివరాలు : EPF డ్రా చేసుకునే ముందు ఏ అకౌంట్కు బదిలీ చేయాలో.. ఆ బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పించాలి

గుర్తింపు, చిరునామా ధృవపత్రాలు:  ఆధార్ కార్డు, పాస్ పోర్టు లేదా ఓటర్ ఐడీ కార్డు వంటి  మీ గుర్తింపు, ప్రస్తుత చిరునామాకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాలి. 

రద్దు చేయబడిన చెక్కు: విత్ డ్రా మరింత సులభతరం చేసుందుకు IFSC కోడ్ , అకౌంట్ నంబర్ కలిగి ఉన్న రద్దు చేయబడిన చెక్కును అప్ లోడ్ చేయాలి. 

విత్ డ్రా చేసుకునే ప్రాసెస్.. 

ఆన్ లైన్ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా కంపెనీ యజమాని సంతకం లేకుండానే PF మొత్తం నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.క్లెయిమ్ ప్రాసెస్ చేసిన తర్వాత 15 రోజుల్లోగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దీనికోసం యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్(UAN), అప్డేట్ చేయబడిన KYC, మీ UAN తో రిజస్టర్ తో చేయబడిన మొబైల్ నంబరు తప్పనిసరిగా ఉండాలి. తద్వారా కంపెనీ ఆమోదం లేకుండానే మీ EPF మొత్తాన్ని సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు. 

విత్ డ్రాకు ప్రాసెస్ ఇదే..

  • EPFO  మెంబర్ పోర్టల్ unifiedportal-mem.epfindia.gov.in/memberinterface సందర్శించాలి. 
  • మీ UAN నంబర్, పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ తర్వాత మొదట KYC అప్డేట్ చేయాలి. దీనికి కోసం పోర్టల్ లోని Message  ను క్లిక్ చేసి.. జాబితా నుంచి KYC పై క్లిక్ చేయాలి. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వంటి సమాచారంతో మీ KYC వివరాలు జాగ్రత్తగా ఎంటర్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. 
  • తర్వాత Online Service ట్యాబ్ ను క్లిక్ చేయాలి. 
  • డ్రాప్ డౌన్ మెను నుంచి క్లెయిమ్ (ఫారం 31, 19, 10C, 10D) లలో ఒకదానిని క్లిక్ చేయడం ద్వారా ద్వారా క్లెయిమ్ సెలక్ట్ చేసుకోవాలి. 
  • తర్వాత మీ బ్యాంక్ ఖాతా, ఇతర అవసరమై సమాచారాన్ని నమోదు చేయాలి.సభ్యుల వివరాలను ధృవీకరించాలి. ఆ తర్వాత క్లెయిమ్ సబ్మిట్ చేయాలి. 
  • మీరు క్లెయిమ్ చేసిన మొత్తాన్ని EPFO ద్వారా ఈ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని పేర్కొంటూ సర్టిఫికేట్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ ఫాం వస్తుంది. నిబంధనలు, షరతుల కోసం Yes క్లిక్ చేయాలి. 
  • ఆన్ లైన్ క్లెయిమ్ కొనసాగింపులో భాగంగా.. ‘‘ప్రొసీడ్ ఫర్ ఆన్ లైన్ క్లెయిమ్’’ క్లిక్ చేయాలి. 
  • ఇప్పుడు ‘I Want To Apply క్లిక్ చేస్తే.. loan or advance , pension withdrawal ఆప్షన్లు ఉంటాయి. వీటిలో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి. 
  • స్కాన్ చేసిన చెక్, ఫారం 15G, బ్యాంకు ఖాతా వంటి డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. 
  • మీ క్లెయిమ్ ఆమోదించబడిన 15 రోజుల్లో విత్ డ్రా డబ్బు మీ అకౌంట్ కు బదిలీ చేయబడుతుంది.