ఫేస్​ రికగ్నైజేషన్​తోనూ యూఏఎన్​

ఫేస్​ రికగ్నైజేషన్​తోనూ యూఏఎన్​

న్యూఢిల్లీ:  రిటైర్​మెంట్​ ఫండ్​ సంస్థ ఈపీఎఫ్​ఓ మెంబర్లు ఇక నుంచి ఫేస్​ రికగ్నైజేషన్​ ద్వారా యూనివర్సల్ ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్​నంబర్​ (యూఏఎన్​)ను తీసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం తెలిపారు.  ఉమంగ్​ మొబైల్ యాప్‌‌ని ఉపయోగించి ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (ఎఫ్​ఏటీ)తో నేరుగా యూఏఎన్​ని పొందవచ్చని ఆయన తెలిపారు. 

ఉద్యోగి కోసం ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (ఎఫ్​ఏటీ)ని ఉపయోగించి యూఏఎన్​ని రూపొందించడానికి యజమాని కూడా ఉమంగ్​ యాప్‌‌ని ఉపయోగించవచ్చు.  యూఏఎన్​ని రూపొందించడానికి, ఉద్యోగి ఉమంగ్​ యాప్‌‌ని తెరిచి, ఫేస్​రికగ్నైజేషన్​ ద్వారా యూఏఎన్​ అలాట్​మెంట్​ ఆప్షన్​పై క్లిక్​చేయాలి. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్​ తర్వాత, ఆధార్ డేటాబేస్‌‌లోని  మొబైల్ నంబర్‌‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్​చేస్తే యూఏఎన్​ క్రియేట్​అవుతుంది. ఉమంగ్​ యాప్ లేదా సభ్యుల పోర్టల్ నుంచి యూఏఎన్​ కార్డ్‌‌ని డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు.