పాశమైలారంలో నిధి ఆప్కే నికట్

పాశమైలారంలో నిధి ఆప్కే నికట్
  • ప్రయాస్​ పథకం ద్వారా పెన్షన్​ చెల్లింపు

పటాన్​చెరు, వెలుగు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పటాన్​చెరు కార్యాలయ ఆధ్వర్యంలో  ప్రయాస్  పథకం ద్వారా  పదవి విరమణ చెందిన వారికి పెన్షన్​ చెల్లింపు ఆర్డర్ లను పంపిణీ చేశారు. గురువారం     పాశమైలారం అరబిందో ఫార్మ కంపెనీలో నిధి ఆప్కె నికట్​   కార్యక్రమాన్ని ఈపీఎస్​ అధికారులు ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో ఈ  నెలలో పదవీ విరమణ పొందిన 15 మందికి పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను అందజేశారు.

. ఈ సందర్బంగా ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్  విశాల్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రయాస్ పథకం ద్వారా ఈపిఎస్​  చందాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉందని  తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ఈపీఎస్​ఓ సభ్యులకు పదవీ  విరమణ పొందిన నెలలోనే పెన్షన్ ప్రయోజనాలను మంజూరు చేసేందుకు సులభతరం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆర్. శ్రీదేవి,-   హెచ్ఆర్ హెడ్ డాక్టర్ రాజు,  అరబిందో ఫార్మా, ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్ శ్రీ ఏ. పెద్ది రాజు అకౌంట్స్ ఆఫీసర్ అబ్దుల్ అజీమ్ పాల్గొన్నారు.