సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సమాన పనికి సమాన వేతనం

సుప్రీం గైడ్‌‌లైన్స్‌‌ అమలు చెయ్యాలె

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీంకోర్టు గైడ్‌‌‌‌‌లైన్స్‌‌ను మహబూబ్‌‌నగర్, నిర్మల్‌‌ జిల్లాల్లోని ఆస్పత్రుల్లో పనిచేసే సహాయ సిబ్బందికి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఔట్‌‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌‌ పద్ధతిపై 1998, 2000, 2001, 2006, 2013 సంవత్సరాల్లో జిల్లా ఆస్పత్రుల్లో 4వ కేడర్‌‌‌‌ ఉద్యోగులుగా జాయిన్‌‌ అయ్యి పనిచేస్తున్నా.. వేతనాల చెల్లింపుల్లో తేడా అన్యాయమని ఎ.బుచ్చయ్య సహా 76 మంది రిట్లు దాఖలు చేశారు. పిటిషన్లను బుధవారం విచారించిన జస్టిస్‌‌ అభినంద్‌‌ కుమార్‌‌ షావిలి.. పిటిషనర్లకు కనీస టైం స్కేల్‌‌ అమలు చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. రెగ్యులర్‌‌ స్టాఫ్‌‌తో సమానంగా కాంట్రాక్ట్‌‌, ఔట్‌‌సోర్సింగ్‌‌ స్టాఫ్ 20 ఏండ్లుగా పనిచేస్తున్నారని పిటిషనర్‌‌ తరుఫు లాయర్​ కోర్టుకు తెలిపారు. టెక్నికల్‌‌ వింగ్స్‌‌లో వర్క్‌‌ చేసే వాళ్లకి రూ.12 వేల నుంచి 15 వేల వరకు, నాన్‌‌ టెక్నికల్‌‌ వింగ్స్‌‌లో పని చేసే వాళ్లకు రూ.9400 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని కోర్టుకు చెప్పారు. రెస్పాండెంట్లకు నోటీసులిచ్చిన హైకోర్టు విచారణను 4 వారాలు వాయిదా వేసింది.

For More News..

ధర్నా చేస్తున్న కార్యకర్తను కడుపులో తన్నిన ఎస్సై

ఈఫిల్ టవర్‌‌‌‌కు బాంబు బెదిరింపు

భారత శాటిలైట్స్‌పై చైనా ఎటాక్