- మార్కెట్లో వైరస్ భయాలు
- సెన్సెక్స్ 1,250 పాయింట్లు డౌన్
- 388 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- రూ.10.98 లక్షల కోట్లు ఆవిరి
- 1.62 శాతం నష్టపోయిన నిఫ్టీ
న్యూఢిల్లీ:ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఘోరంగా దెబ్బతిన్నాయి.సెన్సెక్స్, నిఫ్టీ ఒకటిన్నర శాతానికిపైగా నష్టపోయాయి. హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి వచ్చిం దన్న వార్తలతో రెండు ఇండెక్స్లూ కుదేలయ్యాయి. దీనికితోడు అమ్మకాల ఒత్తిడి, మూడో క్వార్టర్ఫలితాలపై ఆందోళన, విదేశీ నిధుల ఔట్‌ఫ్లో కొనసాగుతూనే ఉండటంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది.
సెన్సెక్స్ 1,258.12 పాయింట్లు (1.59 శాతం) నష్టపోయి 77,964.99 పాయింట్ల వద్ద ఆగింది. ఇంట్రాడేలో 1,444.19 పాయింట్లు పడి 77,781.62 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో 3,474 స్టాక్స్ నష్టపోగా, 656 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 388.70 పాయింట్లు (1.62 శాతం) నష్టపోయి 23,616.05 పాయింట్లు వద్ద సెటిలయింది. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.10.98 లక్షల కోట్లు తగ్గింది.
బీఎస్ఈ లిస్టెడ్‌కంపెనీల మార్కెట్క్యాప్ రూ.4,38,79,406.58 కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ ప్యాక్ నుంచి టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్‌మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, జొమాటో, అదానీ పోర్ట్స్, ఆసియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ఎక్కువగా నష్టపోయాయి. టైటాన్, సన్‌ఫార్మా మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్3.17 శాతం, మిడ్‌క్యాప్2.44 శాతం పడిపోయాయి. బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్సెస్లన్నీ నష్టపోయాయి.
అమ్మకాల ఒత్తిడి...
హెచ్ఎంపీ వైరస్ ఔట్‌బ్రేక్‌తో పాటు బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి, మూడో క్వార్టర్ ఫలితాలు నిరాశ పరుస్తాయనే అంచనాలతో మార్కెట్లు నష్టపోయాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 2–3 శాతం వరకు నష్టపోయాయని వివరించారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.4,227.25 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
ఆసియా మార్కెట్లో సియోల్ లాభపడగా, టోక్యో, షాంఘై, హాంగ్కాంగ్నష్టపోయాయి. యూరప్మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం సానుకూలంగా ముగిశాయి. బ్రెంట్క్రూడ్ధర 0.25 శాతం తగ్గి 76.32 డాలర్లకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు తగ్గి 85.68 వద్ద ముగిసింది.